244) ఆహా నాకేమానందము

** TELUGU LYRICS **

1.  ఆహా నాకేమానందము
    శ్రీ యేసు నాచేఁ బట్టుచు
    సహాయుఁడై నాయన్నిటన్
    సజీవుఁడై నడుపును.
    ||నా దారిఁ జూపును యేసు
    నా చేఁబట్టి నడుపును
    ఎన్నఁడు నెడబాయఁడు
    యేసె నా దారిఁ జూఁపును||

2.  యేదే స్సుఖంబు లైనన్
    సదా విచార మైనను
    బాధాంధకార మైనను
    ముదంబుతోడ నుందును.

3.  చింతేల నాకు నీ దయన్
    సంతత మీవు తోడుగాన్
    బంతంబు నీచేఁ బట్టుచు
    సంతృప్తితో నే నుందును.

4.  నా చావు వేళ వచ్చినన్
    విచార మొందక ధృతిన్
    నీ చేయి బట్టి యేసుఁడా
    నీ చారు మోక్ష మెక్కుదున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------