195) ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘన నామం


** TELUGU LYRICS **

ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం - అన్నింట ఘన నామం (2) 
స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును 
క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2) 
రెండు వేవేనోళ్ళతో స్తుతి నే పాడెదా... (2) 
యేసునందే సత్యం - యేసులోనే మార్గం
యేసే నా నిత్యజీవము (2)  
||ఆరాధింతు||

ప్రభు నామము ఎంతో ఘనమైనది 
అన్ని నామములకంటె హెచ్చైనది (2) 
ఆ నామమందే రక్షణ సోదరా (2) 
యేసయ్య రక్తము చిందించెగా (2) 
యేసే నా రక్షణ - యేసే విమోచన 
యేసే నా నిరీక్షణా (2) 
||ఆరాధింతు||

ప్రభునామము ఎంతో బలమైనది 
అపవాది క్రియ లయపరుచునది (2) 
భయమేల నీకు ఓ సోదరా (2) 
సాతాను సిలువలో ఓడి పోయెగా (2)
యేసు రక్తమే జయం - యేసు నామమే జయం 
యేసునందే విజయం (2) 
||ఆరాధింతు||

---------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా)
---------------------------------------------------------------------------