171) ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో

** TELUGU LYRICS **

    ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతో
    అను పల్లవి: రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతును
    హర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును

1.  పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెను
    పరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను

2.  మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెను
    పరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను

3.  శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెను
    పదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను

4.  పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెను
    సమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను

5.  శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైనను
    ప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు

6.  అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువా
    హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ – హల్లెలూయ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------