** TELUGU LYRICS **
ఆదరింపుము యేసువా నిన్నాశ్రయించితి
నా కికన్ లేదు వేరొక
యాశ్రయంబని లెస్సగా మది నమ్మితిన్
యాశ్రయంబని లెస్సగా మది నమ్మితిన్
||ఆద||
1. నిరతముండెడు పరమ ధనమను నీతి జీవిత రీతిలో పెరుగ గోరుచు
నిన్ను జేరితి ప్రేమ జూపుము యేసువా
||ఆద||
2. సత్య సంధుడ లోక బాంధవ సర్వశాంతి సుధాకర నిత్యజీవ జలంబు
లొసగుము నీతి నిధుల సజీవుడా
2. సత్య సంధుడ లోక బాంధవ సర్వశాంతి సుధాకర నిత్యజీవ జలంబు
లొసగుము నీతి నిధుల సజీవుడా
||ఆద||
3. ముందు వెనుకను దుష్ట శక్తుల మూక నన్నరి కట్టగన్ బంధితుండనైతి
నా ప ద్బాంధవ విడిపించుమా
3. ముందు వెనుకను దుష్ట శక్తుల మూక నన్నరి కట్టగన్ బంధితుండనైతి
నా ప ద్బాంధవ విడిపించుమా
||ఆద||
4. పరమ పురమున కరుగ నేరని పాలసుడనో రక్షకా కరుణతో నా
మొరను గైకొని కలుషముల నెడబాపవే
4. పరమ పురమున కరుగ నేరని పాలసుడనో రక్షకా కరుణతో నా
మొరను గైకొని కలుషముల నెడబాపవే
||ఆద||
5. పరమ ధాముడ వని యెరిగి నీ శరణు వేడితి నో ప్రభో తనువు
విడిచిన వేళలో నీ తలుపు నాకై తెరువు మా
5. పరమ ధాముడ వని యెరిగి నీ శరణు వేడితి నో ప్రభో తనువు
విడిచిన వేళలో నీ తలుపు నాకై తెరువు మా
||ఆద||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------