** TELUGU LYRICS **
అద్యంత రహిత ప్రభువా
రాజులకు రాజా ప్రభు యేసూ నీవే సదా
రాజులకు రాజా ప్రభు యేసూ నీవే సదా
ఆది జనకుడు ఏదేను తోటలో - శోధనలో పడి వేధించినపుడు
ఆశలన్ని అడిఆశలుగా జేసె - అధములను నీవు ఆవరింతువు
అమృతమూర్తి నీవే - ప్రభూ - సాటి నీకెవరు?
స్థానము విడచి తన మహిమ విడచి - అనుదినము నిను దూషించు వైరి
ప్రధానత్వమును పాదుచెసికొని - నీ ప్రభుత్వమున్ నిరాకరించిన
నీచున్ ప్రేమించితివి - ప్రభూ - సాటి నీకెవరు?
పిలిచితివి ఇశ్రాయేలు సంతతిని - వేలకొలది వాగ్దానములతో
కలిమియందున కలతలందున - తొలగిపోయిన తల్లడిల్లిన
చల్లగా కాచితివి - ప్రభూ - సాటి నీకెవరు?
రాజ్యమేలిరి రారాజు లెందరో - రాజనగరుల రత్నాల సిరులతో
రాజ్యకాంక్షతో రణములు సలిపిరి - రథములను చూచి సదయున్ మరచిన
నిత్య సాత్వీకుడవు - ప్రభూ - సాటి నీకెవరు?
పరమ జనకుని పలు వాక్కు లెన్నియో
ధరను ప్రజలను ప్రవచించు కొరకై
నిర్ణయించితివి దైవజనులను - పేరాశ కలిగి పెడత్రోవ నడచిన
కరుణించితివి వారిన్ - ప్రభూ - సాటి నీకెవరు?
పాడెదన్ ప్రభూ నీ ప్రేమగీతం
పడిచెడిన నన్ను ప్రేమించితివివని
కడిగిన ప్రభు - కలుషమునెల్ల - విడచిన నేను నీ జాడలన్నియు
నడిపించె నీవికుడు - ప్రభూ - సాటి నీకెవరు?
** ENGLISH LYRICS **
Adhymtha Rahitha Prabhuvaa
Raajulaku Raajaa Prabhu Yaesoo Neevae Sadhaa
Aadhi Janakudu Aedhaenu Thoataloa -
Shoadhanaloa Padi Vaedhimchinapudu
Aashalanni Adiaashalugaa Jaese -
Adhamulanu Neevu Aavarimthuvu
Amruthamoorthi Neevae - Prabhoo - Saati Neekevaru?
Sthaanamu Vidachi Thana Mahima Vidachi -
Anudhinamu Ninu Dhooshimchu Vairi
Pradhaanathvamunu Paadhuchesikoni -
Nee Prabhuthvamun Niraakarimchin
Neechun Praemimchithivi - Prabhoo - Saati Neekevaru?
Pilichithivi Ishraayaelu Smthathini -
Vaelakoladhi Vaagdhaanamulathoa
Kalimiymdhuna Kalathalmdhuna - Tholagipoayina Thalladillin
Challagaa Kaachithivi - Prabhoo - Saati Neekevaru?
Raajyamaeliri Raaraaju Lemdharoa -
Raajanagarula Rathnaala Sirulathoa
Raajyakaamkshthoa Ranamulu Salipiri -
Rathamulanu Choochi Sadhayun Marachin
Nithya Saathveekudavu - Prabhoo - Saati Neekevaru?
Parama Janakuni Palu Vaakku Lenniyoa
Dharanu Prajalanu Pravachimchu Korakai
Nirnayimchithivi Dhaivajanulanu -
Paeraasha Kaligi Pedathroava Nadachin
Karunimchithivi Vaarin - Prabhoo - Saati Neekevaru?
Paadedhan Prabhoo Nee Praemageethm
Padichedina Nannu Praemimchithivivani
Kadigina Prabhu - Kalushmunella -
Vidachina Naenu Nee Jaadalanniyu
Nadipimche Neevikudu - Prabhoo - Saati Neekevaru?
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------