231) ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ

    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ 
    మరణము కంటె బలమైన ప్రేమది (2)
    నన్ను జయించే నీప్రేమ                                                          

1.  పరమును వీడిను ప్రేమ ధరలో -పాపిని వెదకిన ప్రేమ (2)
    నన్ను కరుణించీ,ఆదరించీ,సేదదీర్చీ,నిత్య జీవమిచ్చే (2)     

2.  పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ (2)
    నాకై మరణించి,జీవమిచ్చీ జయమిచ్చి తన మహిమనిచ్చే (2)

3.  నాస్థితి జూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ (2)
    నాకై పరుగెత్తి,కౌగిలించి ముద్దాడి, కన్నీటిని తుడిచెను (2)  

4.  శ్రమను సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ (2)
    విడనాడనీ,ప్రేమదీ ఎన్నడు ఎడబాయనిది (2)  

No comments:

Post a Comment

Do leave your valuable comments