** TELUGU LYRICS **
ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా
1. దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా
మరణించాడు మరిలేచాడు - నీ నా పాప విమోచనకే
2. ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
రూపు రేఖలు కోల్పోయాడు - నీ నా పాప విమోచనకే
3. పాపుల రక్షకు డేసయ్యా - కార్చెను రక్తము పాపులకై
తన దరిజేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో
4. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగ వస్తాడయ్యా
నమ్మిన వారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా
5. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై
అతి వినయముగా బ్రతిమాలుచున్నాడు - నేడే నమ్ముము యేసుప్రభున్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------